Banner
Watermark
చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దాం కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేయర్ కోలగాని శ్రీనివాస్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
📅 07 August 2026, 04:30 PM ✍️ admin
News Image
మన సంప్రదాయానికి ప్రతీక అయిన చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దామని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి సంక్షేమ పథకాలు అందించి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పచ్చనూరు చేనేత క్లస్టర్ తయారు చేసిన చీరను ఆవిష్కరించారు. ఆడిటోరియం వద్ద టెస్కో కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలతో కూడిన ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశారు.
అనంతరం చేనేత ప్రతిజ్ఞ చేశారు.
అంతకుముందు గీతా భావం చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు చేనేత సహకార సంఘాల అధ్యక్షులు పాలకవర్గ సభ్యులు, కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ వాసాల రమేష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home