Banner
Watermark
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
📅 07 August 2026, 04:28 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు -07
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రతి దానికి గడువు విధించి.. నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.


వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం దేవాదాయ శాఖ, మున్సిపల్, ఆర్ అండ్ బీ, ఎన్పీడీసీఎల్, నీటి పారుదల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్మికుల సంఖ్యను మరింత పెంచి.. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

రారాజేశ్వర ఆలయానికి చెందిన నూతన గోశాల పనులపురోగతిపై అడిగి తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు చేశారు.

గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలపై పర్యాటక శాఖ, వేములవాడ మున్సిపల్ శాఖ అధికారులకు సూచనలు చేశారు.

బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 ఫీట్ల రహదారి విస్తరణ పనుల పురోగతిపై ఆరా తీశారు. రహదారి నిర్మాణం, ఇరువైపులా మురుగు కాలువ నిర్మాణ తుది దశ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ టవర్ల నిర్మాణ పనులను త్వరితగతిన మొదలు పెట్టాలని సూచించారు.

జిల్లా వైద్య కళాశాల, బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తుది దశ పనులను వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే సిరిసిల్లలో కోర్టు సముదాయ పనులు షెడ్యూల్ ప్రకారం చేయాలని అధికారులను సూచించారు.

సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, ఆలయ ఈఈ రాజేష్,
ఎన్ పీడీసీఎల్ ఈఈ వేణుమాధవ్,
మున్సిపల్ కమిషనర్ లోకేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వీటీఏడీఏ తదితరులు ఉన్నారు.
🏠 Home