Banner
Watermark
గొల్లపల్లిలో గాలం చెరువు తూము లీకేజీకి మరమ్మతులు సకాలంలో స్పందించిన సర్పంచ్, ఇరిగేషన్ అధికారులకు రైతుల కృతజ్ఞతలు
📅 07 August 2026, 03:58 PM ✍️ admin
News Image
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 07 : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామ గాలం చెరువు నిండిపోయింది. ఈ సందర్భంగా చెరువు తూము వద్ద నీటి లీకేజీ ఏర్పడటాన్ని గమనించిన రైతులు వెంటనే గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ గ్రామపంచాయతీ నుంచి జేసీబీని పంపించి తక్షణ చర్యలు చేపట్టారు. అలాగే ఇరిగేషన్ శాఖ ఏఈ భాస్కర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు.
ఇరిగేషన్ ఏఈ భాస్కర్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి అవసరమైన మరమ్మతు పనులు చేపట్టారు. తూము వద్ద ఏర్పడిన లీకేజీని పూర్తిగా అరికట్టి చెరువు భద్రతను పటిష్టం చేశారు.
సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించిన గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, ఇరిగేషన్ ఏఈ భాస్కర్ రెడ్డి మరియు సిబ్బందికి గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, ఏఈ భాస్కర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సిబ్బంది, వార్డు సభ్యులు గొర్రె మల్లేశ్ యాదవ్, పర్శరాములు గౌడ్, యువ నాయకులు వెంకటేష్ రెడ్డి, రైతులు గోగురి శ్రీనివాస్ రెడ్డి, సాలయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home