Banner
Watermark
జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇన్‌చార్జి జిల్లా ట్రెజరీ అధికారి కె. రమేష్
📅 04 August 2026, 03:32 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, ఆగస్టు - 4: పెద్దపల్లి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సహాయ ట్రెజరీ అధికారి (ఏటీఓ)గా విధులు నిర్వహిస్తున్న కె. రమేష్‌కు ఇన్‌చార్జి జిల్లా ట్రెజరీ అధికారి (డీటీఓ)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించబడిన సందర్భంగా మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జి జిల్లా ట్రెజరీ అధికారి కె. రమేష్ జిల్లా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లా ట్రెజరీ కార్యాలయ నిర్వహణ, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల నిర్వహణ, ప్రజలకు మెరుగైన సేవలందించే అంశాలపై స్వల్పంగా చర్చించారు.
---------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home