Banner
Watermark
హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం
📅 01 August 2026, 03:22 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు -01 హైకోర్టు న్యాయమూర్తి, రాజన్న సిరిసిల్ల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎన్ తుకారాంజీ గారికి జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.పుష్పలత, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె శనివారం స్వాగతం పలికారు.

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయనకు సిరిసిల్ల పట్టణంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో పుష్పగుచ్ఛాలు అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

కార్యక్రమంలో పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సిరిసిల్ల, వేములవాడ సీనియర్ సివిల్ న్యాయమూర్తులు పి.లక్ష్మణాచారి, అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి జి.మేఘన, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రచారి చారి, తహసీల్దార్ మహేష్, తదితరులు ఉన్నారు.
🏠 Home