సిరిసిల్ల - వన్ పల్లి బస్సును యాధావిధిగా నడపాలి - బీఎస్పీ వీర్నపల్లి మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్
📅 01 August 2026, 10:42 AM
✍️ admin
వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి మండల కేంద్రాలను తాకుతూ వన్ పల్లి గ్రామానికి ప్రతిరోజు వెళ్ళే సిరిసిల్ల - వన్ పల్లి రూట్ గల సిరిసిల్ల ఆర్టీసీ డిపో బస్సును యధావిధిగా నడపాలి అని బీఎస్పీ వీర్నపల్లి మండల అధ్యక్షుడు గజ్జెల ప్రశాంత్ కోరారు. దుమాల, అక్కపల్లి గ్రామాలకు ఈ బస్సు వెళ్లడం వల్ల వీర్నపల్లి మండలంలోని దాదాపు అన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోయారు. వీలైతే దుమాల, అక్కపల్లి గ్రామాలకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రద్దీ వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కడం దూర ప్రాంతాల్లోకి వెళ్ళడం వల్ల ఇటు ప్రయాణికులకు అటు వాహన చోదకులకు ఇబ్బందులు అవుతున్నాయని ప్రశాంత్ వాపోయారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సిరిసిల్ల - వన్ పల్లి రూట్ బస్సును యాధావిధిగా నడిపేటట్టు మరియు దుమాల అక్కపల్లి గ్రామాలకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకోవాలని గజ్జెల ప్రశాంత్ డిమాండ్ చేశారు