Banner
Watermark
బహుళ జాతి కంపెనీలు నిజామాబాద్ రావలసిన అవసరం ఎంతైనా ఉంది-అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.
📅 01 August 2026, 10:41 AM ✍️ admin
News Image
నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి నిజామాబాద్ ఆగస్టు 1:-నిజామాబాద్ టీ హబ్ లో మల్టీ నేషనల్ కంపెనీలు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు, శుక్రవారం రోజు సాయంత్రం నిజామాబాద్ నగరంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయాల పక్కన మరియు నిజామాబాద్ బైపాస్ రోడ్డు నందు గల టీ హబ్ లో ఎన్ ఎన్ ఏఐ సొల్యూషన్స్ అనే స్టార్ట్ అప్ కంపెనీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే. ధన్ పాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం నిజామాబాద్ నగరము అన్ని రంగాల్లో దినదిన అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా అధిక సంఖ్యలో నిజామాబాద్ జిల్లా నుండి కూడా యువతి యువకులు టెక్నాలజీ ప్రావీణ్యం ఉన్న కోర్సులను అభ్యసిస్తున్నారని అటువంటి వారికి తాము ఉన్నచోటే ఐటీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తే అనేకమంది యువతీ యువకులు నిజామాబాద్ జిల్లాను వదిలి హైదరాబాద్ వెళ్లవలసిన అవసరము ఉండదని అందుకు మరిన్ని ఐటి ఆధారిత కంపెనీలు స్టార్ట్ అప్ కంపెనీలు ఇందూరు జిల్లాకు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మరియు నిజామాబాద్ నగరంలో నెలకొని ఉన్న టీ హబ్ లో కొత్త కొత్త స్టార్ట్ అప్ కంపెనీలు కూడా ప్రారంభించవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మీడియాకు తెలిపారు, ఇంకా ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మీడియాతో మాట్లాడుతూ మంచి కంపెనీలు ఉంటే ఇందూరు యువత హైదరాబాద్ నగరానికి మరియు బయటి రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు ఉందే అవకాశం ఉంటుందన్నారు, ఇటీవలే తాను ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగిందని ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు కూడా సానుకూలంగా స్పందించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు అదేవిధంగా వచ్చేవారమే నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వస్తానని మరియు ఈ యొక్క టీ హబ్ పరిస్థితులను తెలుసుకుంటానని శ్రీధర్ బాబు తనకు హామీ ఇచ్చినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మీడియాకు తెలిపారు, ఇంకా ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ యువతకు ఐటీ రంగంలో మంచి టాలెంట్ ఉందని వారికి మంచి అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ స్పష్టం చేశారు.
కాగా ప్రస్తుతము టీ హబ్ లో కేవలము 12 వివిధ రకాల ఐటి కంపెనీలు మాత్రమే ఉన్నాయని, అయితే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి మొట్ట మొదటి ఐటీ కంపెనీ నిజామాబాద్ లోని. టీ హబ్ కి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే అన్నారు, ప్రస్తుతం ఏఐ శకం నడుస్తుందని ఇందుకు సంబంధించిన కంపెనీని తాను తన చేతుల మీదుగా నిజామాబాద్ ఐటీ హబ్ లో ప్రారంభించడం అత్యంత శుభ పరిణామం అని అర్బన్ ఎమ్మెల్యే మీడియాతో అన్నారు.
ఇంకా ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తోపాటు నిజామాబాద్ నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎన్ ఎన్. ఏ ఐ ఇన్నోవేషన్స్ కంపెనీ సీఈవో నజీబుద్దిన్ తో పాటుగా స్థానిక బిజెపి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home