నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి బీఆర్ఎస్ పార్టీ ఘన నివాళి
ఎల్లారెడ్డిపేట జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గా ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన కీలక పాత్రను, ఉద్యమ విజయానికి అందించిన సేవలను, పార్టీ బలోపేతానికి చేసిన కృషిని స్మరించుకున్నారు. వారి నిరాడంబర నాయకత్వం, ప్రజాసేవ పట్ల అంకితభావం, ఉద్యమంలో మిగిల్చిన చిరస్మరణీయ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పార్టీకి, తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, నాయకులు,సెస్ డైరెక్టర్లు వర్స కృష్ణహరి,దార్నాం లక్ష్మినారాయణ,ఫ్యాక్స్ ఛైర్మెన్లు గుండారపు కృష్ణరెడ్డి,బండి దేవదాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుంబాల మల్లారెడ్డి, గజభింకర్ రాజన్న, ఆకుల చిన్న, సంపత్, హరీష్,శ్రీనివాస్,అక్రమ్ అశోక్ రావు, సత్యనారాయణ,అజయ్, బాలకిషన్ కార్యకర్తలు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించారు.