Banner
Watermark
*సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆపరేషన్ నిమిత్తమై ఇందిర(22) మహిళకు ఓ నెగిటివ్ రక్తం అవసరం
📅 31 July 2026, 12:56 PM ✍️ admin
News Image
*సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న*
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు*

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆపరేషన్ నిమిత్తమై ఇందిర(22) మహిళకు ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో వెంటనే స్పందించి రిజర్వడ్ యస్ఐ సాయి ప్రసన్న ను సంప్రదించడంతో వెంటనే స్పందించి ఓ నెగటివ్ రక్తాన్ని రెయిన్బో రక్తనిధి కేంద్రంలో అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రజలను రక్షించే ఎస్సైగా ఉంటూనే మహిళ ప్రాణాలను కాపాడడం కోసం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన సాయి ప్రసన్నకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సైఫ్,బట్టు భరద్వాజ్ లు పాల్గొనడం జరిగింది.
🏠 Home