Banner
Watermark
గురుపూజోత్సవం సందర్భంగా శివపరాశక్తి పీఠాన్ని దర్శించుకున్న డి.ఎస్.పి
📅 29 July 2026, 11:56 AM ✍️ admin
News Image
ఎల్లారెడ్డిపేట జూలై 29 : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని శ్రీ శివ పరాశక్తి పీఠాన్ని
గురుపూజోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి దర్శించుకున్నారు,
ఈ సందర్భంగా శివ పరాశక్తి పీఠం స్వామీజీ కాసు మనోహర్ రాజు అర్చకులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ లు డిఎస్పి నాగేంద్ర చారి కి సీఐ వెంకటేష్ కు ఆశీర్వచనం అందజేశారు,
శివ పరాశక్తి పీఠాన్ని మొట్టమొదటిసారిగా దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంగా డిఎస్పి నాగేంద్ర చారిని సీఐ ఓ వెంకటేశ్ ను స్వామీజీ శాలువాలు కప్పి సన్మానించారు,
అనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్రెడ్డి , శ్రీరామోజీ భాస్కర్ లు శివయ్య ను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు,
🏠 Home