Banner
Watermark
జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి గా అజ్మీరా తిరుపతి నాయక్
📅 27 July 2026, 04:10 PM ✍️ admin
News Image
ఎల్లారెడ్డిపేట జూలై 27 : రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షులు శ్రీ అన్నబోయిన తిరుపతి (A T యాదవ్ )గారి ఆధ్వర్యంలో జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ అజ్మీర తిరుపతి నాయక్ గారిని నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన పంపిన లేఖ లో నూతనంగా నియమితులైన ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్ గారికి హృదయపూర్వక అభినందనలు చెపుతూ
సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు తిరుపతి నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home