తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం గంప శశాంక్ జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కే
📅 26 July 2026, 09:38 AM
✍️ admin
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా
రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు
తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గంప శశాంక్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని తల సేమియా చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉంటుందని ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రక్తదాతలు ముందుకు రావాలని అన్నారు. రక్తదాన శిబిరానికి సహకరిస్తున్న యువజన విభాగానికి కృతజ్ఞతలు తెలియజేశారు.