Banner
Watermark
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన యువకులు నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్ విశ్వహిందూ పరిషత్-బజరంగ్ దళ్ రామారెడ్డి ప్రఖండ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షార్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక
📅 19 July 2026, 11:15 AM ✍️ admin
News Image
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన యువకులు


నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్


విశ్వహిందూ పరిషత్-బజరంగ్ దళ్ రామారెడ్డి ప్రఖండ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షార్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భజరంగ్ దళ్ కామారెడ్డి జిల్లా సహ సంయోజక్ కడెం సాయికుమార్ గారు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మం లో చెట్లను ప్రకృతిని పూజించి రక్షించుకునే సంప్రదాయం ఉంటుంది సనాతన ధర్మం లో భూమిని నీరును ఆకాశాన్ని చెట్లను పక్షులను జంతువులను పూజించుకొని రక్షించుకొని మానవాళికి దోహదపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ధర్మంలో సాంప్రదాయాల అనుకూలంగా చెట్లను కాపాడుకునే సంప్రదాయం ఎప్పటినుండి ఉండడం జరిగింది అందు కారణంగా ఈరోజు వృక్షాపన పేరుతో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చెట్లను నాటడం వాటిని రక్షించుకునేటువంటి విషయాలను కార్యకర్తలకు విద్యార్థులకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అందరికి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తూ చెట్లను నాటించడం జరిగింది
ఈ కార్యక్రమంలో స్థానిక SI మురళి సార్ గారు,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ గారు, భజరంగ్ దళ్ కామారెడ్డి జిల్లా సహా సంయోజక్ కడెం సాయి గారు, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి దండబోయిన గంగాధర్ గారు, జిల్లా కోశాధికారి అమ్ముల శ్రీనివాస్ గారు, ప్రఖండ ఉపాధ్యక్షుడు భూంపల్లి భాస్కర్ గారు, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దండ బోయిన సిద్ధరాములు గారు అలాగే భజరంగ్ దళ్ కార్యకర్తలు , వివిధ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
🏠 Home