*గుడ్డుకు బదులు అరటిపండు పల్లి పట్టి ,గ్యాస్ నిత్యవసర వస్తువులు ప్రభుత్వమే సప్లై చేయాలని డీఈఓ కు వినతి* కామారెడ్డి నేటి ప్రభాత దర్శిని. ప్రతినిధి. ఈరోజు ఏఐటీయూసీ కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరి
*గుడ్డుకు బదులు అరటిపండు పల్లి పట్టి ,గ్యాస్ నిత్యవసర వస్తువులు ప్రభుత్వమే సప్లై చేయాలని డీఈఓ కు వినతి*
కామారెడ్డి నేటి ప్రభాత దర్శిని. ప్రతినిధి.
ఈరోజు ఏఐటీయూసీ కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య , MDM రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి,మాట్లాడుతూ పౌష్టికాహారంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు కోడి గుడ్డు పెట్టాలని నిబంధన ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు ధర 9 రూపాయలు ఉండటంతో ఒక విద్యార్థికి గుడ్డు పెట్టాలంటే మూడు రూపాయలు అదనంగా ఏజెన్సీ నిర్వాహకులపై పడుతుందని ఇప్పటికే బిల్లులు రాక అవస్థలు పడుతున్న కార్మికులకు మోలుగే నక్కపై తాటికాయ పడ్డ చిన్నంగా తయారైందని అన్నారు. కావున విద్యార్థులకు కోడిగుడ్డుకు బదులు అరటిపండు లేదా పల్లి పట్టి పెట్టడానికి అవకాశం కల్పించాలని కోరారు. మరియు నిత్యవసర వస్తువులు గ్యాస్ కోడిగుడ్లు ప్రభుత్వం సప్లై చేయాలని, ప్రభుత్వము 10,000 వేతనం ఇస్తానని అన్నది కార్మికులకు ఇవ్వాలని ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగినది
పై అంశాలపై సానుకూలంగా స్పందించిన డిఈఓ గారు కోడిగుడ్డుకు బదులుగా అరటిపండు పెట్టాలని ఆదేశిస్తామని ఏజెన్సీ విషయమై హెడ్మాస్టర్ తో చర్చిస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా aituc బాలరాజు, దశరథ్ , సాయిలు దుర్గయ్య, స్వరూప, లక్ష్మి, సరిత,కార్మికులు పాల్గొన్నారు