*మొక్కలు నాటేందుకు సిద్ధంగా పెట్టాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *వన మహోత్సవంపై అటవీశాఖ, వివిధ శాఖల అధికారులతో సమీక్ష* ------------------------ రాజన్న సిరిసిల్ల, జూలై -15 ------------------------ వర్షాలు కురిసిన తరువాతే మొక్కలు నాటేందుకు సిద్ధంగా
*మొక్కలు నాటేందుకు సిద్ధంగా పెట్టాలి*
*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
*వన మహోత్సవంపై అటవీశాఖ, వివిధ శాఖల అధికారులతో సమీక్ష*
------------------------
రాజన్న సిరిసిల్ల, జూలై -15
------------------------
వర్షాలు కురిసిన తరువాతే మొక్కలు నాటేందుకు సిద్ధంగా పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ఆద్వర్యంలో మొక్కలు నాటే లక్ష్యంపై జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, పలు శాఖలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వివిధ పథకాల కింద గతంలో నాటిన మొక్కలు ఎండిపోయిన, పెరగకపోయిన వాటిని అటవీశాఖ అధికారులు పరిశీలించాలని సూచించారు. వర్షాలు కురిసిన తరువాతే ఏర్పాట్లు చేసి.. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు.
నీటి పారుదల శాఖ స్థలాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అటవీ ప్రాంతాలు, మున్సిపల్ డంపింగ్ యార్డులు, ఫారెస్ట్ అర్బన్ పార్క్, ఎక్సైజ్ శాఖ, నూతన రహదారుల వెంట మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నర్సరీలు ఉండాలని స్పష్టం చేశారు. వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కల లక్ష్యం మొత్తం 8,65,200 గా లక్ష్యాన్ని నిర్ణయించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు.
సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా ఎక్సైజ్ అధికారి హిమశ్రీ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, మైనింగ్ శాఖ ఏడీ క్రాంతి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.