Banner
Watermark
*మేర యువ భారత్ లో యువ వాలంటీర్ నియామకాలకు దరఖాస్తు ఆహ్వానం* భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మరియు క్రీడాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో (మై భారత్), మేరా యువ భారత్ కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం మరియు గ్రామీణ ప్రాంతాల్లో యువజన సంఘా
📅 15 July 2026, 01:52 PM ✍️ admin
*మేర యువ భారత్ లో యువ వాలంటీర్ నియామకాలకు దరఖాస్తు ఆహ్వానం*

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మరియు క్రీడాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో (మై భారత్), మేరా యువ భారత్ కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం మరియు గ్రామీణ ప్రాంతాల్లో యువజన సంఘాల నిర్మాణం కోసం యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తు ఆహ్వానించడం అయినది. ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల మేరా యువ భారత్ అధికారి బి. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకువెళ్లడం ప్రతి గ్రామంలో యువజన సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం, యువతకు సామాజిక సేవ వైపు తీసుకు వెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
*అర్హత* వయసు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి.

*విద్య అర్హత* కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కామారెడ్డి జిల్లాకు చెందిన వారై ఉండాలి సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండాలి.

*దరఖాస్తు విధానం* ఆసక్తిగల అభ్యర్థులు మై భారత్ అధికారిక పోర్టల్ https://mybharat.gov.in/pages/ny_corps_gjt కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ దరఖాస్తును సమర్పించాలని ఇందులో ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
*చివరి తేదీ* ఈ నెల 20 -07-2026 ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం 5000 రూపాయలు , రెండు సంవత్సరాల కాలం పాటు, ప్రతి మండలానికి ఇద్దరు యువ వాలెంటర్ లు అవసరం
*ఎంపిక విధానం* ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. శిక్షణ మరియు సర్టిఫికెట్ అందజేయబడుతుంది. మరిన్ని వివరాలకు మేరా యువభారత్ నిజామాబాద్ కార్యాలయం ఫోన్ నెంబర్ 7780338076
🏠 Home