Banner
Watermark
*నక్ష సర్వే పకడ్బందీగా పూర్తి చేయండి* *ప్రతి ఇంటి వివరాలు పక్కాగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *వేములవాడలో నక్ష సర్వే పరిశీలన* ------------------------------- వేములవాడ, జూలై -10 -------------------------------- నక్ష సర్వే పకడ్బందీగా
📅 10 July 2026, 05:25 PM ✍️ admin
News Image
*నక్ష సర్వే పకడ్బందీగా పూర్తి చేయండి*

*ప్రతి ఇంటి వివరాలు పక్కాగా నమోదు చేయాలి*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*వేములవాడలో నక్ష సర్వే పరిశీలన*

-------------------------------
వేములవాడ, జూలై -10
--------------------------------

నక్ష సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

వేములవాడ పట్టణంలో రోవర్ యంత్రంతో నక్ష సర్వే కొనసాగుతుండగా శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఒక ఇంటి చుట్టు కొలతలు ట్యాబ్ లో ఎంట్రీ అవుతున్న విధానాన్ని పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. నక్ష సర్వేతో ప్రతి ఇంటికి సంబంధించిన పూర్తి విస్తీర్ణం వివరాలు పక్కాగా నమోదు అవుతాయని వెల్లడించారు. మున్సిపల్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సంయుక్తంగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. త్వరలోనే వేములవాడ పట్టణానికి సంబంధించిన నక్ష సిద్ధం అవుతుందని తెలిపారు.

పరిశీలనలో ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, మున్సిపల్ కమిషనర్ లోకేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home