Banner
Watermark
​ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదు : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *​పెద్దపల్లిలోని 33వ వార్డు,19వ వార్డు లో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్* *​మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చే
📅 10 July 2026, 04:40 PM ✍️ admin
News Image


*​ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదు : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*

*​పెద్దపల్లిలోని 33వ వార్డు,19వ వార్డు లో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్*

*​మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలి*

--------------------------
​పెద్దపల్లి, జూలై 10:
-------------‐------------
​పెద్దపల్లి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు నమోదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అధికారులను ఆదేశించారు.

శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదు సమీపంలోని 33వ వార్డు భారత్ నగర్, 19వ వార్డు బండారికంట లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

​ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించే ఈ ప్రక్రియలో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి ఫారాలను సేకరించేటప్పుడు ఎటువంటి తప్పులు దొర్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

​ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సందేహాలను నివృత్తి చేసేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

​అలాగే, గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ సమైక్య సంఘాల సభ్యుల సహకారంతో ఎన్యూమరేషన్ ఫారాలను ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సూచించారు.

​ఈ తనిఖీలో ఆర్.డి.ఓ. గంగయ్య,మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్,ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
🏠 Home