అనారోగ్యంతో బాధ పడుతున్న మారం ప్రవీణ్ కు 27వేల రూపాయల ఆర్థిక సాయం అందజేత
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
మానవత్వం మిగిలేవుంది అని నిరూపిస్తున్న దాతలు.
ప్రముఖ కళాకారుడు మారం ప్రవీణ్ కుమార్ అనారోగ్య బారిన పడడంతో, అతని కుటుంబ సభ్యులు కరీంనగర్ లోని ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు తాత్కాలిక చికిత్స అందించి, హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించా లని, వైద్యానికి దాదాపు 25 లక్షల నుండి 35 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడం, ఆర్థిక పరిస్థితులు బాగాలేక మారం ప్రవీణ్ ఇంటికి రావడం జరిగింది. ప్రస్తుతం అతను అనారోగ్యంతో తీవ్రఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో ఇతను సామాజికసేవలలో పాలుపంచుకుంటూ, ఎంతో మందికి ఆపద సమయంలో అండగా నిలిచారు. కానీ ఇతనికి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి రావడం బాధాకరమైన విషయం. ఆయన వైద్యం పెద్దమొత్తంలో ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో అతనికి మనం మానవతా దృక్పథంతో సహాయ, సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనాఉందని సోషల్ మీడియా ద్వారా కోరగా దాతలు స్పందించి అందించిన విరాళాలు డబ్బులు 27వేల రూపాయలు అతని ఇంటికి వెళ్లి అందజేయడం జరిగిందని
ఇంకా ఎవరైనా దాతలు మారం ప్రవీణ్ కోలుకోవడానికి వైద్య ఖర్చులకి ఆర్థిక సాయం అందించాలని అనుకునేవారు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టు గూగుల్/ఫోన్ పే నం. 89855 88060 కు అందిస్తే వారికి అందజేయడం జరుగుతుందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ సభ్యులు మధు మహేష్, పొలాస రాజేందర్, సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు