Banner
Watermark
అపరెల్ పార్క్, గోదాముల్లో ధాన్యానికి అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచాలి
📅 04 June 2026, 12:04 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల, జూన్ - 04
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్, వాహనాలు, ఇతర అంశాలపై పౌర సరఫరాల శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సహకార శాఖ, మెప్మా, రవాణా శాఖ, వ్యవసాయ శాఖ, తదితర శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్య, గన్ని సంచులు, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసి వేశారు.. తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.

అపరెల్ పార్క్, గోదాముల్లో ధాన్యానికి అనుగుణంగా హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ధాన్యానికి అనుగుణంగా ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు, తరలింపు, అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
🏠 Home