Banner
Watermark
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ కొనుగోళ్ల పూర్తి, రవాణా వేగవంతానికి ఆదేశాలు
📅 04 June 2026, 11:25 AM ✍️ admin
News Image
జూన్ 04
జనగామ
గురువారం, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని అలింపూర్, కొడవటూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, రవాణా వ్యవస్థను సమగ్రంగా పరిశీలించారు.

ఇప్పటివరకు లారీలు ఎన్ని వెళ్ళాయి? ఏ మిల్లులకు పంపిస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు 992 క్వింటాళ్ల ధాన్యం కాంటా పూర్తయిందని, మిగిలి ఉన్న ధాన్యం కాంటా పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.

ధాన్యాన్ని అదనంగా పది ట్రాక్టర్ల ద్వారా త్వరితగతిన మిల్లులకు త్వరితగతిన తరలించాలి అని, రెండు లేదా మూడు రోజుల్లో కొనుగోళ్లను పూర్తి చేయాలని సూచించారు.

రవాణాలో ఎలాంటి ఆలస్యం లేకుండా సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
🏠 Home