నగరవాసులకు ఆహ్లాదం కరువు- నిరుపయోగంగా మారిన రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్.
నేటి ప్రభాత దర్శిని ప్రత్యేక కథనం నిజామాబాద్ జూన్ 4:
నిజామాబాద్ పట్టణం నానాటికి జనాభాలో వృద్ధి సాదిస్తున్నప్పటికీ నగర ప్రజలకు ఆదివారాలు కానీ సెలవు దినాల్లో కానీ సేద తీరడానికి దశాబ్దాలు గడుస్తున్నా ఎటువంటి సరియైన ఆహ్లాదాన్నిచ్చే ప్రభుత్వ పార్కులు నగరంలో లేవని చెప్పొచ్చు, నానాటికి నిజామాబాద్ పట్టణము వ్యాపార పరంగా వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, వ్యాపార పరంగా పలు కార్పొరేట్ వస్త్ర షో రూమ్లు బంగారు ఆభరణాల షోరూములు నానాటికి కొత్తగా వెలుస్తున్నప్పటికీ మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ పరంగా కూడా జిల్లాలో పెరుగుతున్న జనసంఖ్య ఆధారంగా నిజామాబాద్ నగరంలో విరివిగా అపార్ట్మెంట్ల నిర్మాణం కూడా జరుగుతున్నప్పటికీ, మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్న నిజామాబాద్ నగరంలో కేవలం పదుల సంఖ్యలో కొన్ని రోడ్లు తప్ప దశాబ్దాలు గడిచిన మెజారిటీ శాతం రోడ్లు ట్రాఫిక్ తదితర సమస్యలు ఎక్కడి వేసిన గొంగళి లా అక్కడే ఉన్నాయి, వీటన్నింటి మధ్య కనీసం నగర వాసులకు ఆదివారాలు లేదా సెలవు దినాల్లో సేద తీరడానికి నిజామాబాద్ పట్టణంలో ఎటువంటి ప్రభుత్వ పార్కు కానీ నగర ప్రజల వినోదం కోసం మరే విధమైన సౌకర్యాలు లేవు.
కాగా గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిజామాబాద్ నగర శివారు ప్రాంతంలో వెలిసినటువంటి రఘునాథ చెరువును ఆనుకొని సుమారు 20 కోట్ల పైచిలుకు ధనం వెచ్చించి మరియు నాలుగు సంవత్సరాలు నిర్మాణం జరిగిన రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ పార్కు గేట్లకు ప్రస్తుతం సుమారు గత నెల రోజుల నుండి తాళం వేసి ఉంచడంతో, ఆహ్లాదం కొరకు నిజామాబాద్ పట్టణంలోని తిలక్ గార్డెన్ పార్కుకు వెళ్దామంటే అది ప్రైవేట్ సంస్థ నిర్వహణలో ఉండడంవల్ల మరియు ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిలక్ గార్డెన్ పార్కు నందు ఏళ్లు గడుస్తున్న కొత్తగా ఇక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎటువంటి ప్రత్యేక ఆహ్లాదానిచ్చే ఆట వస్తువులు లేనందువల్ల నిజామాబాద్ పట్టణ ప్రజలు నగర శివారులో నూతనంగా నిర్మించిన రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ వైపు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు, అయితే ఈ మినీ ట్యాంక్ బండ్ అనేది జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మించడం వల్ల ఇది ప్రారంభించి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇక్కడ కూడా ఎటువంటి ప్రత్యేకమైన అభివృద్ధి కానరావడం లేదు, అయినప్పటికీ ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండడంవల్ల నగర ప్రజలు సేద తీరడానికి ఇక్కడికి రావడానికి మొగ్గు చూపుతున్నారు.
పార్కు గేట్లకు తాళం:-కాగా గత నెల రోజుల క్రితమే ఈ యొక్క పార్కు నిర్వహణ కాంట్రాక్టు ముగిసినందున మరియు ఈ యొక్క పార్కు నిర్వహణ కొరకు ఎటువంటి నూతన టెండర్లు పిలవకపోవడం వలన, మరియు ఈ యొక్క పార్కు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న నీటిపారుదల శాఖ వారు ఈ యొక్క రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్వహణను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మరియు కొత్తవారికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతము ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్ పార్కు గేట్లకు తాళాలు వేసి ఉండడంతో పార్క్ లో పిచ్చి ముక్కలతో నిండిపోయింది, కావున ప్రస్తుతం ఉన్న వేసవిలో సేద తీరడానికి నగర ప్రజలకు ఆహ్లాదం కరువైందని చెప్పవచ్చు, ఇట్టి విషయంలో అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్వహణ బాధ్యతలను సరియైన వ్యక్తులకు అప్పగించి నిరంతరం పార్కు అభివృద్ధి జరిగే విధంగా చూడాలని నిజామాబాద్ నగర ప్రజలు అధికారులను కోరుతున్నారు.