Banner
Watermark
ఎక్కువ ధాన్యం నిల్వ లు ఉన్న కేంద్రాల మీద ప్రత్యేక దృష్టి
📅 03 June 2026, 01:47 PM ✍️ admin
News Image
జూన్ 03
జనగామ
జిల్లా లో
ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ తుది దశ కి చేరుకున్న నేపథ్యంలో... అధికారులు మరింత పర్యవేక్షణ చేస్తే త్వరగా కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం మిల్ లకు రవాణా అవుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు

జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...
అవసరమైన చోట అదనపు వాహనాలు, హమాలీలను అందుబాటులో ఉంచి కొనుగోళ్లు, రవాణా ను వేగవంతం చేయాలన్నారు


ఇప్పటివరకు (29187) రైతుల వద్ద నుంచి (1,82,235) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, అందులో ఇప్పటికే (1,76,004) మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించడం జరిగిందని, అలాగే (27181) మంది రైతుల ఖాతాల్లోకి రూ. 337 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా (1,46,263) మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్ లో నమోదు చేయడం జరిగిందని, మొత్తం (572) మంది హమాలీలు ఉన్నారన్నారు.

ఇంకా
కొనుగోలు, రవాణా చేయాలిసిన అంశం మీద సంబందిత
మిల్లు, కేంద్రం వారీగా కొనుగోలు వివరాలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, అలాగే మిల్లుల వద్ద ఎంత అన్లోడింగ్ పెండింగ్ ఉంది అని కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు.

ధాన్యం రవాణా, నిల్వ, లోడింగ్, అన్లోడింగ్, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎటువంటి ఆలస్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

జిల్లాలో ప్రస్తుతం (234) లారీలు, (66) డీసీఎంలు, (307) ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఇంకా ఎక్కువ ధాన్యం ఉన్న కేంద్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అదనపు వాహనాలను పంపించి త్వరగా మిల్ లకు తరలించాలన్నారు

రైస్ మిల్లుల వద్ద నిలిచిపోయిన లారీలను వెంటనే అన్‌లోడ్ చేసి, తిరిగి కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


ధాన్యం కొనుగోలు కేంద్రాలు ముగింపు దశకు చేరుకున్నందున, రవాణా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షించి, ధాన్యం తరలింపులో ఎటువంటి అంతరాయం లేకుండా మిల్లులకు, గోదాములకు పంపించాలని సూచించారు.

మిల్లులకు వచ్చే ధాన్యాన్ని మరింత మంది హమాలీలను పెట్టుకొని, త్వరగా దిగుమతి అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.

రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

ఎక్కువ ధాన్యం ఉన్న కేంద్రాలను తహసీల్దార్ లు సందర్శించి వెంటనే రవాణా ప్రక్రియ త్వరగా కావాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్ లు ఆయా కేంద్రాలను పర్యవేక్షణ చేస్తూ.. కావాలిసిన వాహనాలను, హమాలీ లను ఏర్పాటు చేస్తున్నారు

ఈ సమావేశంలో డీఆర్‌డీవో భాస్కర్, డీఎంఓ రామకృష్ణ, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శిల్ప,వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home