Banner
Watermark
ధాన్యం కోనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
📅 29 May 2026, 01:47 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, మే-29 జిల్లాలో రైతుల ధాన్యం కొనుగోళ్ల లో ఎలాంటి కటింగ్ జరగొద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రైతుల ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్ జరగకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాణ్యత పరిశీలించిన ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కటింగ్ చేయవద్దని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 100 శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని ఆదేశించారు.

జూన్ 2 నాటికి అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి కేంద్రాలను మూసివేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో డీఆర్‌డీవో కలిందిని, డీసీవో శ్రీమాల, ఏపీఎంలు, ఏ.పి.ఓ.లు ,సంబంధిత అధికారులు తదితరులు ,పాల్గొన్నారు.
---------------------------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.
🏠 Home