Banner
Watermark
కొనుగోలు కేంద్రాల్లో అదనపు కలెక్టర్ పరిశీలన
📅 23 May 2026, 04:28 PM ✍️ admin
News Image
తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట, మే 23 తంగళ్లపల్లి మండలం పాపాయిపల్లి, లక్ష్మీపూర్, చింతలఠాణా, చీర్లవంచ, గోపాల్ రావుపల్లి అలాగే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. ఎంత తరలించారు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేయాలని సూచించారు. వాహనాలను సమకూర్చాలని ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ధాన్యం లోడింగ్, మిల్లులు, గోదాముల్లో అన్ లోడింగ్ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

పరిశీలనలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, తహసీల్దార్ సుజాత, ఏపీఎం, సిబ్బంది తదితరులు ఉన్నారు.
🏠 Home