లోడింగ్, ఆన్ లోడింగ్ మీద ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ధాన్యం కొనుగోలు లో మరింత వేగం పెరగాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు
బుధవారం లింగాల ఘనపూర్ మండలం జీడికల్ గ్రామం లో ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికం గా సందర్శించి... కొనుగోలు ప్రక్రియ ని నిశితం గా పరిశీలించారు
ఈ సందర్బంగా... ఇప్పటి వరకు కేంద్రం లో జరిగిన
కొనుగోలు వివరాలు, రిజిస్టర్ నిర్వహణ, ట్యాబ్ ఎంట్రీ, లోడింగ్, ఆన్ లోడింగ్ ఎలా అవుతుందని కలెక్టర్ ఆరా తీశారు
అనంతరం కలెక్టర్ కేంద్ర నిర్వాహకులకు పలు ఆదేశాలు, సూచనలను ఇచ్చారు
ప్రతీ బస్తా 41 కేజీ లు మాత్రమే ఉండాలని... ఎక్కువ తూకం వేయకూడదని...కాంట ప్రక్రియ త్వరగా కావాలని,
సరిపడా హమాలీ లను పెట్టుకొని కొనుగోలు అయిన ధాన్యం త్వరగా మిల్ లకు తరలించాలన్నారు
ట్రక్ తో... కేంద్రానికి సంబందించిన ఎవరో ఒకరు తప్పకుండ వెళ్లి ఆన్ లోడింగ్ త్వరగా అయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు
ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేస్తే....రైతుల ఖాతా లో నగదు జమ ఆలస్యం కాదన్నారు