Banner
Watermark
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏఐ, లైఫ్ స్కిల్స్ పై నాలుగు రోజుల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
📅 19 May 2026, 01:39 PM ✍️ admin
News Image
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏఐ, లైఫ్ స్కిల్స్ పై నాలుగు రోజుల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో ఈ నాలుగు రోజుల శిక్షణను మే 27 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల విద్యార్హతలు ఏదైనా ఇంటర్/డిప్లమా, డిగ్రీ కలిగిన వారు అర్హులు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు తేదీ: 26-05-2026 వరకు సాయంత్రం 5 గంటల లోపు పని దినాలలో బీసీ స్టడీ సర్కిల్, కరీంనగర్ కార్యాలయంలో ఆఫ్ లైన్ లో(నేరుగా) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో స్టడీ సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ఆధార్ కార్డు పత్రాలను మరియు (02) పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. ఈ శిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 08782-268686 ను సంప్రదించాలని ఆయన కోరారు.
🏠 Home