Banner
Watermark
ఇండ్ల గణన ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితంగా జరగాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 19 May 2026, 01:37 PM ✍️ admin
News Image

జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు

జనగాం మండలం
పెద్ద పహాడ్ అలాగే జనగాం మున్సిపాలిటీ లో ని 13 వ వార్డు లో జరుగుతున్న ఇండ్ల గణన ప్రక్రియ ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు

ఈ సందర్బంగా కలెక్టర్ ఎన్యూమారేటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ...
ఇంటింటి సర్వే సక్రమంగా, పారదర్శకంగా జరిగేలా చూడటం ఎన్యుమరేటర్ల ప్రధాన బాధ్యత అని తెలిపారు

నిర్దేశిత నిబంధనల ప్రకారం.. మొబైల్ యాప్ ద్వారా స్పష్టమైన, కచ్చితమైన వివరాలను సేకరించాలాన్నారు

మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు ఇళ్ల గణన నిర్వహిస్తారని, ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి, నమోదు చేయాలని ఆదేశించారు.

అందరి వివరా లు గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. ఎండాకాలం నేపథ్యంలో ఓ ఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వాటర్ బాటిల్‌ వెంట తీసుకువెళ్లాలని సూచించారు.

ప్రజలు కూడా
ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు ఎలాంటి దాపరికం లేకుండా ఖచ్చితమైన సమాధానాలు చెప్పాలని.... దీనివల్ల ప్రభుత్వానికి సరైన లెక్కలు అందుతాయన్నారు
🏠 Home