Banner
Watermark
మిల్ ల దగ్గర ఆలస్యం కావద్దు ప్రతీ కేందాన్ని పర్యవేక్షించండి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 19 May 2026, 01:36 PM ✍️ admin
News Image
సివిల్ సప్లై, రవాణా, డి ఆర్డీ ఓ, సహకార తదితర శాఖల అధికారులు అలాగే కేంద్ర నిర్వాహకులు సమన్వయముగా పని చేయడం తో పాటు...అధికారులు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షణ లు చేసి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలా బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు

మంగళవారం జనగాం మండలం పెద్ద పహాడ్ లో ఏర్పాటు చేసిన PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని... జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అసస్మికం గా సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్,ట్యాబ్ ఎంట్రీ ని పరిశీలించారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...... అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా
కొనుగోలు కావాలని... 41 కేజీ కంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు

సరిపడా హమాలీ లని పెట్టుకొని కాంట ప్రక్రియ త్వరగా కావాలని...ప్రతీ కేంద్రానికి సరిపడా ట్రక్ లను ఏర్పాటు చేశామని... ఆలస్యం చేయకూడదని.... వెంట వెంటనే కాంట అయిన ధాన్యం ట్రక్ లోకి లోడింగ్ చేపించాలన్నారు

అలాగే ట్యాబ్ ఎంట్రీ కూడా ఎప్పటికప్పుడు కావాలని... పెండింగ్ లో పెట్టకూడదన్నారు

మిల్లర్లు కూడా సరిపడా గోదాం లను ఏర్పాటు చేసుకొని....ట్రక్ లు రాగానే..
ఆన్ లోడింగ్ త్వరగా చేసుకోవాలని... కొనుగోలు కేంద్రాలలో ఉండే ధాన్యం త్వరగా మిల్ లకు చేరేలా సహకరించాలన్నారు
🏠 Home