ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
నేటి ప్రభాత దర్శిని. కామారెడ్డి. ప్రతినిధి. కరుణాకర్ కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫర్దిపేట గ్రామంలో
బాడీ తీర్మానం లేకుండా, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా భారీ మొత్తంలో బిల్లులు తీసుకున్నారాని వార్డు సభ్యులు ఆరోపించారు. ముఖ్యంగా కేవలం నాలుగు నెలల్లోనే ₹11 లక్షల వరకు బిల్లులు తీసుకున్నారాని, కానీ పాత పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ చేయలేదని మండిపడ్డారు.
సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ వార్డు సభ్యులకు చెప్పకుండా, తీర్మానం లేకుండా డబ్బులు ఎలా తీశావని మరియు నీ సొంత నిర్ణయాలు, వ్యవహారాలు చూసి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని డిమాండ్ చేశారు. అయితే సర్పంచ్ జీడిపల్లి నర్సింహ రెడ్డి మరియు ఉపసర్పంచ్ నుండి సరైన సమాధానాలు రాకపోవడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2026లో తీసుకున్న బిల్లులకు 2023, 2024 జియో - ట్యాగ్ ఫొటోలు ఎందుకు ఉన్నాయి? పాత పనులను కొత్త పనులుగా చూపించారా? అంటూ సభ్యులు నిలదీశారు.
మేము పాత బకాయిలు చెల్లించాలని కోరినప్పుడు, సర్పంచ్ గారు ‘నేను 30 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాను… అందరికీ ఇస్తూ పోతే నాకు ఏమి మిగులుతుంది’ అని మాట్లాడటం మాకు తీవ్ర బాధ కలిగించింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.*
అదేవిధంగా, పంచాయతీ కార్యాలయానికి వెళ్లినప్పుడు వార్డు సభ్యుల ఫోన్లు తీసుకుని పక్కన పెట్టిన, తర్వాత మాట్లాడండి అని చెప్పడం ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా ఉందని ఆరోపించారు.
పాత బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు
కానీ ఎంపిక చేసుకుని కొంతమందికి మాత్రమే బిల్లులు క్లియర్ చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు.
ఈ సందర్భంగా సభ్యులు మీడియాతో మాట్లాడుతూ:
గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు. కానీ ఇప్పుడు గ్రామంలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలు చూసి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. గ్రామ ప్రజల డబ్బుపై సృష్టత లేకపోవడం చాలా బాధాకరం. గ్రామంలో జరుగుతున్న కొన్ని నిర్ణయాలు చూసి మేమే ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది అని భావోద్వేగానికి గురయ్యారు.
సర్పంచ్ నర్సింహారెడ్డి గతంలో BRS పార్టీలో వైస్ ఎంపీపీగా, ఇంచార్జ్ ఎంపీపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు గ్రామ ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోందని పేర్కొన్నారు.
ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ వార్డు సభ్యులను పట్టించుకోకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని మండిపడ్డారు.
అవసరమైతే తదుపరి రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకుంటామని వార్డు సభ్యులు హెచ్చరించారు.