Banner
Watermark
ఇళ్లు ప్రారంభించి నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్..
📅 13 May 2026, 03:10 PM ✍️ admin
News Image

మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది...ఇప్పటికే ఇళ్లు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి..

ఈరోజు నవాబ్ పేట లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం జరిగింది వారికి శుభాకాంక్షలు..

రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లు జూన్ నుండి ప్రారంభం కాబోతున్నాయి..

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారు ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలి..

స్థానిక నాయకత్వం వారు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి సహకరించాలి.

గత 10 సంవత్సరాలుగా ఒక డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు..

గతంలో చాలా సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూమ్ కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు..

ప్రజా ప్రభుత్వంలో గ్రామగ్రామాన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం..

ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగింది

ఈ సంవత్సరం కూడా 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుంది.. అందరికీ శుభాకాంక్షలు..
🏠 Home