Banner
Watermark
జనగామ కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 13 May 2026, 02:35 PM ✍️ admin
News Image
మే 13
జనగామ బుధవారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని కుందారం, దేవరుప్పుల మండలంలోని కోలుకొండ, పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను, అయ్యంగారిపల్లి, గూడూరు, ఘనపూర్ (స్టేషన్) మండలంలోని శివునిపల్లి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి, కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్టర్లను, ఇప్పటివరకు కేంద్రాలకు వచ్చిన ధాన్యం, అందులో ఎంత కొనుగోలు చేశారు? ఎంత మిల్లులకు తరలించారు? లారీల గురించి కలెక్టర్ కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి అన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

ధాన్యం తూకం, నాణ్యత పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు అనంతరం వెంటనే రశీదులు అందజేయాలని తెలిపారు.

కేంద్రాల్లో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను సక్రమంగా పరిశీలిస్తూ రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని అన్నారు.

అదే విధంగా ధాన్యం నిల్వ, రవాణా ప్రక్రియలను వేగవంతం చేసి ఎక్కడా నిల్వలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.

ధాన్యం బస్తాల దిగుమతిలో మిల్లుల వద్ద ఒకరు తప్పకుండా బాధ్యత వహించి, త్వరితగతిన దిగుమతి అయ్యేలా చూడాలన్నారు.

కొనుగోళ్లకు సంబంధించిన ప్రతి రిజిస్టర్, ట్రక్ షీట్ పక్కాగా నిర్వహించాలని తెలిపారు.

సరిపడా హమాలీలను సమాకుర్చుకోవాలని, లారీలు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

కొనుగోలు అయిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ లో నమోదు చేయాలన్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైతులు, కేంద్రం నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అలాగే ఏపీఎంలు, సీసీలు, కేంద్ర నిర్వాహకులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

రైతులు గంటల తరబడి వేచి ఉండకుండా ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి నిర్లక్ష్యం, ఆలస్యం చోటు చేసుకున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాణ్యత పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తోందని, ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
🏠 Home