ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు
సిరిసిల్ల మే 11 (నేటి ప్రభాత దర్శిని) సిరిసిల్ల పట్టణం 12 వార్డు చంద్రంపేట లో కోడం రేఖ రావలి నీల శ్రీనివాస్ కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం. కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు సూర నిర్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు
ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కొరకు అనేకమైన పథకాల అందిస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు
ఇల్లు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక మంది నిరాశ్రయులకు సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవడం ఆనందకరమని అన్నారు.. ఇందిరమ్మ వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో నూనె శ్రీనివాసు కత్తెరపాకి ఎల్లయ కోడం నాగభూషణం గుడిసెట్టి బాలరాజు తడుక వెంకటేశం మేన సత్యనారాయణ సదుల గంగాధర్ కోలకని రాజేశం తదితరులు పాల్గొన్నారు