వివోఎ ల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి పత్రంసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ
📅 09 May 2026, 03:48 PM
✍️ admin
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ
ఉట్నూర్ నేటి ప్రభాత దర్శిని మే 9 ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు ఐకెపి. వివో ఏ. జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎండి. తాజోద్దీన్ ఖాన్. ఆధ్వర్యంలో వివోఏ లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు వారి న్యాయమైన ప్రధాన డిమాండ్లను తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ శాఖ మంత్రి. కమిషనర్. తో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సేర్ఫ్ ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉందని ప్రభుత్వం మహిళలకు వివో సంఘాల ద్వారా అనేక పథకాలు లబ్ధి చేకూరుస్తూ ఆర్థికంగా బలపరుస్తుందని మహిళా సంఘాలకు సంబంధించిన శాఖ ఉద్యోగుల డిమాండ్లను తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివో ఏ. జేఏసీ. నాయకులు. తదితరులు. పాల్గొన్నారు