Banner
Watermark
అన్ని పాఠశాల లోని 6వ తరగతి నుండి 9 వ తరగతి చదివే బాల బాలికలు అప్లై చేసుకోవచ్చు ప్రిన్సిపాల్ మామిళ్ళ విఠల్
📅 09 May 2026, 03:17 PM ✍️ admin
News Image
తంగళ్ల పల్లి మండలం మండేపల్లి లో పి యమ్ శ్రీ ఆదర్శ పాఠశాల మండేపల్లి ఆధ్వర్యంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం “సమ్మర్ క్యాంప్–2026” నిర్వహించబడుతోంది. ఈ సమ్మర్ క్యాంప్‌ను మే 11 నుండి మే 25, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మామిళ్ళ విఠల్ తెలిపారు.

మండలం లోని అన్ని పాఠశాల్లో 6 నుండి 9వ తరగతి వరకు చదువుతున్న బాలురు మరియు బాలికలు ఈ క్యాంప్‌లో పాల్గొనవచ్చని తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

ఈ సమ్మర్ క్యాంప్‌లో కథా చెప్పడం, వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం, మాక్ పార్లమెంట్, ఔట్ డోర్ గేమ్స్ , ఇండోర్ గేమ్స్, యోగా, కరాటే, కంప్యూటర్ శిక్షణ వంటి విభిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.
విద్యార్థులు తమ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని పాఠశాల యాజమాన్యం కోరింది. ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే మొ.హనీఫ్ ట్రైనర్ 9966638445 గారిని సంప్రదించి తమ పిల్లలను నమోదు చేయించాలని సూచించారు.
🏠 Home