Banner
Watermark
టాస్క్ ఆద్వర్యంలో ఈ నెల 11వ తేదీన బ్యాచ్ లు ప్రారంభం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
📅 06 May 2026, 04:17 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల, మే -06 సిరిసిల్ల టాస్క్(తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్) రీజనల్ సెంటర్లో టెక్నికల్ కోర్సులు, బ్యాంకింగ్ నందు ఉచిత శిక్షణ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

డిగ్రీ/బీటెక్ అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఓరియెంటషన్ కు హాజరు కావాలని సూచించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు 11 వ తేదీ నుంచి బ్యాచ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.

*టాస్క్ నందు శిక్షణ పొందిన అభ్యర్థులకు మంచి ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిగతా వివరాలకు 9573420718, 7075522671 నంబర్లలో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
🏠 Home