Banner
Watermark
నేటి ప్రభాత దర్శిని చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులురాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి
📅 30 April 2026, 03:29 PM ✍️ admin
News Image
కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో మండల కార్యాలయాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలపై సంబధిత అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో రైతులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు,వేసవి లో తాగునీటి సరఫరా లో ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు , ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, బడిబాట కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచడం,వర్షకాలంలో వన మహోత్సవం ద్వారా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటెల చర్యలు తీసుకోవడం ఇతర అభివృద్ధి కార్యక్రమాల పై అధికారులతో సమీక్షా చేశారు

సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
చిగురు మామిడి మండలంలో 21 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా 7 ఎమ్మార్వో,7 ఎంపీడీఓ, 7 వ్యవసాయ అధికారి ఇంచార్జి గా ఉంటారని మొత్తానికి డిపిఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక జీపీవో, గ్రామ కార్యదర్శి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులకు టర్పాలిన్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల వద్ద లారీ ల సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చిగురు మామిడి మండలంలో వేసవి కాలంలో తాగునీటి సరఫరా లో సమస్యలు రాకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దొంతులపల్లి లో ఉన్న తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ సమస్యల్లో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పాత బావులు పూడికతీత చేసి ఉపయోగించుకోవాలని సూచించారు. సుందరిగిరి లో ఇప్పటికే వేసిన బోరు కి మోటార్ కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడం పై విద్యుత్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి వనరులు ఉన్న బావుల నుండి పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. కొత్తపల్లి - హుస్నాబాద్ మధ్య నిర్మిస్తున్న నాలుగు లేన్ రోడ్డు లో పైప్ లైన్ ఎందుకు షిఫ్ట్ చేయలేదని అధికారులను ప్రశ్నించారు.రాజీవ్ రహదారి కొత్తపల్లి నుండి హుస్నాబాద్ మధ్య జరుగుతున్న నాలుగు లైన్ రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ,వర్షాకాలం వస్తె పనులకు ఆటంకాలు అవుతాయనీ సూచించారు.

బడి బాట ద్వారా ఇంటింటికి తిరిగి పిల్లలు చేరేలా చర్యలు తీసుకోవాలనీ, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచాలనీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. చిగురు మామిడి మండలంలో అన్ని పాఠశాలలకు పెయింట్స్ వేయడంతో పాటు, మౌలిక సదుపాయాలు బెంచ్ లు ,వాష్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండలంలో ఒక్కో విద్యార్థికి ఉపాధ్యాయునికి నిష్పత్తి తక్కువగా ఉందని విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. చాలా గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ప్రతిజ్ఞ చేస్తున్నారని ఈసారి ప్రీ ప్రైమరీ నుండి విద్యార్థులపై ఫోకస్ చేయాలన్నారు. స్వయంగా బడి బాట కార్యక్రమంలో తను పాల్గొంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మండలంలో ఉన్న 31 పాఠశాలకు 1225 మంది విద్యార్థులున్నారని వాటి సంఖ్య గణనీయంగా పెంచాలని సూచించారు.చిగురు మామిడి మండలంలో ఈసారు వన మహోత్సవం ద్వారా 80 వేల మొక్కలు నాటాలని అధికారులు పెట్టుకున్న లక్ష్యానికి మించి అదనంగా ప్లాంటేషన్ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని వారి సహకారంతో మొక్కలు నాటాలని అన్నారు. మండలంలో కొత్త రోడ్లు పూర్తయిన ప్రాంతాల్లో ఇరువైపుల మొక్కలు నాటాలని ఆదేశించారు.

మండలంలో 341 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవగా 42 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయి పని ప్రారంభం కాని 9 ఇళ్లు నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ఆదేశించారు. 193 ఇల్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని జూన్ 2 లోపు భారీగా ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం జరగాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. చిగురు మామిడి మండలంలో 280 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందని రైతులకు అవగాహన కల్పించడానికి హార్టికల్చర్ అధికారులు రైతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.గ్రామాల్లో ప్రతి సర్పంచ్ 50 ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫాం సాగు చేసేలా అవగాహన కల్పించాలని ఆయిల్ ఫాం ద్వారా అధిక లాభాలు ఉంటాయని, కోతుల బెడద ఉండదని , ప్రకృతి విపత్తులతో ఇబ్బందులు ఉండవనే అంశాలు రైతులకు వివరించాలని తెలిపారు.పంచాయతీరాజ్ ఆర్ అండ్ డి రోడ్లు మంజూరు అయి పనులు ప్రారంభం కాని రోడ్లు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో విద్యుత్ లూస్ కేబుల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలో ప్రతి గ్రామాల్లో హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అంగన్వాడి కొత్త భవనాలు నిర్మాణం పూర్తైనవి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో ప్రారంభించుకోవాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి,మాదక ద్రవ్యాలు నిరోధించడానికి పోలీసులు మండలాన్ని ఆదర్శంగా నిలపాలి. గ్రామాల్లో ఏ సమస్య ఉందో తెలపడానికి ముందు గ్రామాల ప్రజలతో కమిటీ వేసి వారి దగ్గర నుండి వచ్చిన సమస్యలు ఇక్కడ చర్చించడం జరిగింది. అధికారులు ప్రతి సమస్య పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకోవాలి. నియోజకవర్గంలో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి.

సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ,మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, డిపిఓ జగదీశ్వర్, డిఆర్డిఓ శ్రీధర్ ,జెడ్పి సిఈఓ శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
🏠 Home