వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించుటకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 07 వరకు 14 సంII లోపు వయసు కలిగిన బాలబాలికలకు ప్రాముఖ్యత కలిగిన కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఇతర క్రీడల నందు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కె.కోదండ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించుటకు ఉత్సాహవంతులైన వ్యాయమ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరారు.
పట్టణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించుటకు వీసీ & ఎండీ, ఎస్ఏటీజీ, హైదరాబాద్ వారు సూచించిన ఫీజు చెల్లించిన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
కావున, జిల్లాలోని ఉత్సాహవంతులైన వ్యాయమ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, జాతీయ క్రీడాకారులు వారు నిర్వహించదలిచిన క్రీడా వివరములు, గ్రామము, ప్రదేశము తెలియజేస్తూ పూర్తి వివరాలతో తమ దరఖాస్తులను జిల్లా యువజన, క్రీడల కార్యాలయములో తేది: 23-04-2026 లోపు దరఖాస్తులను IDOC, రూమ్ నెం. S15 లో అందజేయగలరని, ఇతర వివరాలకు 9182552593 నంబరులో సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు.