పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం ఎర్త్ డే పోస్టర్ ఆవిష్కరణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన ప్రత్యేక ఎర్త్ డే పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం, కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు వంటి అంశాలలో ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలంటే సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పోస్టర్‌లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ముఖ్య అంశాలు, సందేశాలు, అలాగే సేంద్రీయ ఎరువుల వినియోగం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వంటి సూచనలు ప్రతిబింబించాయని, ఈ పోస్టర్‌ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల వద్ద ప్రదర్శించి, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిసిడిఓ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.