Banner
Watermark
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజావాణికి 218 దరఖాస్తుల రాక
📅 20 April 2026, 04:32 PM ✍️ admin
News Image
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 218 దరఖాస్తుల రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
 
ఏఓ కలెక్టరేట్, తహసీల్ ఆఫీస్ బోయినపల్లి, చందుర్తి, గంభీరావుపేట, ఎంపీడీఓ ఇల్లంతకుంట, విద్యాశాఖ, లీడ్ బ్యాంక్ మేనేజర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, డీ, ఈ సెక్షన్ సూపరిండెంట్, జీజీ హెచ్ సిరిసిల్ల, పశు వైద్య సంవర్ధక శాఖ, అటవీ శాఖ, జిల్లా వైద్యాధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ అధికారికి ఒకటి చొప్పున వచ్చాయి. ఎంపీడీఓ బోయినపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ఆర్డీఓ సిరిసిల్లకు -2 చొప్పున, చేనేత జౌళి శాఖ, ఎంపీడీఓ చందుర్తి, ఎస్పీ కార్యాలయం, తహసీల్ ఆఫీస్ కోనరావుపేట, జిల్లా పౌర సరఫరాల అధికారి, డీటీసీపీఓ, నీటి పారుదల శాఖకు -3 చొప్పున, తహసీల్ ఆఫీస్ ఇల్లంతకుంట, విద్యుత్ శాఖ, ఎస్డీసీ, తహసీల్ ఆఫీస్ ముస్తాబాద్, తహసీల్ ఆఫీస్ వేములవాడ, వేములవాడ రూరల్, ఎల్లారెడ్డిపేటకు - 4 చొప్పున, ఎంపీడీఓ కోనరావుపేట, తంగళ్ళపల్లి, మున్సిపల్ వేములవాడకు – 5 చొప్పున, ఆర్డీఓ వేములవాడకు -6, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, తహసీల్ ఆఫీస్ సిరిసిల్లకు – 7 చొప్పున, ఉపాధి కల్పనా శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి 13 చొప్పున, తహసీల్ ఆఫీస్ తంగళ్ళపల్లికి -11, గృహ నిర్మాణ శాఖకు -31, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు -35 వచ్చాయి.
 
ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. 
🏠 Home