Banner
Watermark
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
📅 20 April 2026, 02:49 PM ✍️ admin
News Image
విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను ముస్తాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కిచెన్ అండ్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలిసి సోమవారం ప్రారంభించారు. కిచెన్, డైనింగ్ హాల్ ఆవరణ, ఫ్రీజర్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు. విద్య శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద నిర్వహిస్తున్నారని, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని వివరించారు. ఇప్పటికే డైట్ చార్జీలు 40 శాతం పెంచామని, కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచామని గుర్తు చేశారు. మెనూ చార్ట్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నా మని వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ తదితర వసతులు ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని ఆకాంక్షించారు.
త్వరలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు.
🏠 Home