Banner
Watermark
ఘనంగా మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 20 April 2026, 01:06 PM ✍️ admin
News Image
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను ప్రచారం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమని తెలిపారు.

బసవేశ్వరుడి ఆశయాలను అనుసరించి సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

అనంతరం అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, కార్యదర్శులు, అధ్యక్షులు, తదితరులు ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి, నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్. ఎల్. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, వీర శైవ లింగాయత్ సంఘం జిల్లా అద్యక్షులు బి. సిద్దయ్య, వీర శైవ సంఘం మండల అద్యక్షులు జిలకర కుమార స్వామి, అగ్రగామి పత్రిక ఎడిటర్ కన్నా పరశురాములు, కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశ్, దిశ మెంబెర్ బి. శ్రీనివాస్, కేజీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, బల్నే వెంకట మల్లయ్య, స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు వలబోజు చక్రపాణి, పద్మశాలి సంఘం టౌన్ ప్రెసిడెంట్ వేముల బాలరాజు, టికేవిస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అభినాష్ నంద, ఎన్బిఎస్ జిల్లా కార్యదర్శి రఘుపతి నంద, చేనేత ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి బిర్రు నర్సింహులు, వీర శైవ లింగాయత్ సంఘం సభ్యులు, గౌడ కమ్యూనిటీ సభ్యులు, ఇతర కుల సంఘాల నాయకులు, ఐడిఒసి సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home