Banner
Watermark
సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 17 April 2026, 04:41 PM ✍️ admin
News Image
[4:34 PM, 4/17/2026] Anthareddy: సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన (PMDDKY) పథకం అమలుపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పంటల ఉత్పాదకత పెంపు కోసం మెరుగైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై మార్గదర్శకాలు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహణ, కిసాన్ క్రెడిట్, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం, మట్టి పరీక్షలు, పంటల ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారిణికి సూచించారు.

తోట పంటల (హార్టికల్చర్) విస్తరణ, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతుల ప్రోత్సాహం, పండ్ల, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు, ఎపికల్చర్ కింద మష్రూమ్, తేనె వంటి వాటిని ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ అధికారికి సూచించారు.

పశువుల ఆరోగ్య సేవలు, టీకాలు, పాలు, మాంసం ఉత్పత్తి పెంపు చర్యలు, పశుపోషణపై రైతులకు శిక్షణ ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారికి సూచించారు.

చేపల పెంపకం ప్రోత్సాహం, చెరువుల వినియోగం, మెరుగుపరచడం, మత్స్యకారులకు సబ్సిడీలు, సాంకేతిక పరిజ్ఞానం, విధానం, రాస్ టెక్నాలజీని ఉపయోగించేలా అవగాహన కల్పించాలని మత్స్య శాఖ అధికారికి సూచించారు.

రైతులకు పంట రుణాలు, ఇతర ఆర్థిక సాయం, స్వయం సహాయక సంఘాలకు (SHGs) రుణాల మంజూరు, ఆర్థిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కు సూచించారు.

కొత్త వ్యవసాయ సాంకేతికతల ప్రదర్శనలు, రైతులకు ప్రాక్టికల్ ట్రైనింగ్, పరిశోధన ఆధారిత అవగాహన పెంపొందించాలని కేవీకే అధికారికి సూచించారు.

గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOs) ప్రోత్సాహం, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి దిశగా కృషి చేయాలని నాబార్డ్ అధికారికి సూచించారు.

ముఖ్యంగా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేసి, ఆయా శాఖలకు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని సుస్థిరంగా మార్చడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయాలని తెలిపారు.

పీఎండీడీకేవై పథకం అమలులో జిల్లాను ఆదర్శ జిల్లాగా నిలబెట్టాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఉద్యాన శాఖ అధికారి రవి కాంత్, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీధర్ రావు, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి, కేవీకే మామ్నూర్ శాస్త్రవేత్త, నాబార్డ్ ఏజీఎం, ఇతర అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
[4:34 PM, 4/17/2026] Anthareddy: End
🏠 Home