పిల్లలతో మాట్లాడుదాం.... విద్యార్థులకు సృజనాత్మకతతో కృత్యాలు నేర్పించాలి...
📅 17 April 2026, 03:12 PM
✍️ admin
ఈరోజు పోషణ పక్షంలో భాగంగా సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలోని గూడెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన కృత్యాలను పరిశీలించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీస్తాయని ఈ సందర్భంగా వివరించడం జరిగింది ఎలాంటి ఒత్తిడి లేకుండా బాలల స్నేహపూర్వక వాతావరణంలో విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తారని చెప్పారు ఆటలు పాటలు కృత్యాల ద్వారా విద్య నేర్పడం వలన వికాసం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది మనిషి మేధోవికాసంలో మొదటి 1000 రోజులు అతి కీలకమైనవి కాబట్టి ఈ దశలో పిల్లలకి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటపాటలతో విద్యను అందించడం ద్వారా వారికి బంగారు భవిష్యత్తును అందించిన వారిని అవుతామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఉపసర్పంచ్ గ్రామ నాయకులు శ్రీనివాసరావు గారు, డిహబ్ కోఆర్డినేటర్ రోజా, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది సాయిరాం పాల్గొన్నారు