రామగిరి మండలంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహణ ఉమ్మడి జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న సర్వేలో భాగంగా రామగిరి మండలంలోని ఆదివారంపేట,రాజాపూర్ గ్రామంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కరీంనగర్ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ సర్వే నిర్వహించారు.జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఆదివారంపేట,రాజాపూర్ గ్రామంలో సర్వే చేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలను,గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన,అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా గ్రామంలోని కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని తెలిపారు.తొలి విడతలో కుటుంబ యజమాని పేరు,సభ్యులు వారి విద్యా అర్హతల గురించి,చదువు మానేసిన,ఉన్నత చదువులు,వృత్తివిద్య కోర్సులు,ఉద్యోగం,స్వయం ఉపాధి,వివరాలు రోజువారి కూలీ అయితే వారంలో ఏ పని చేశారో,ఎన్ని గంటలు పని చేశారో,ఎంత వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్ళు అయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇల్లందుల సంజీవ్,పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య,పంచాయతీ సెక్రటరీలు మెండే వేణుగోపాల్, దాసరపు కిరణ్,ఆశా వర్కర్లు,కాదాసి స్వప్న, సంధ్యా,అంగన్వాడి టీచర్లు ఇల్లందుల లలిత,కారోబార్ పరశురాములు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు