భూ సమస్యల పరిష్కార దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి ...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెన్నంపల్లి గ్రామంలోని పలు వ్యవసాయ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కాల్వ శ్రీరాంపూర్, ఏప్రిల్ -15
భూ సమస్యల పరిష్కార దిశగా చర్యలు అధికారులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో పలు వ్యవసాయ భూములను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, భూభారతి లోని ఆన్లైన్ పెండింగ్ లు త్వరతి గతిన పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ రాముడు ,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది