రహదారి భద్రతపై సిరిసిల్లలో ప్రతిజ్ఞ రవాణా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రవాణా శాఖ, పోలీస్ వారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ బుధవారం చేయడం జరిగింది.
జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారి కుటుంబాలు ఇబ్బంది పడతాయని తెలిపారు. ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది అందరి రక్షణ కోసమే అని, ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.
వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయ రక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ రవాణా శాఖ, పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.సురక్షితంగా చేసే ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు.
కార్యక్రమంలో ఆర్ టీ ఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, డీఎస్పీ నాగేంద్ర చారి,ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి పృథ్వీ రాజ్ వర్మ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.