Banner
Watermark
రాజన్న ఆలయం వద్ద 150 మంది అన్నార్తులకు భక్తులకు అన్నదానంతో పాటు స్వీట్ల పంపిణీ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
📅 15 April 2026, 04:20 PM ✍️ admin
News Image
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి

ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందిస్తున్న సహకారంతో 1821 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున రాజన్న ఆలయం వద్ద 150 మంది పేదలకు అన్నార్తులకు మరియు భక్తులకు అన్నదానంతో పాటు స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్న దాతలుగా పెళ్ళిరోజు సందర్భంగా విశ్వనాథుల శ్రీనివాస్ త్రివేణి దంపతులు, చిరంజీవి పశికంటి యువాన్ష్ పుట్టినరోజు సందర్భంగా పశికంటి రమేష్ బాబు సరస్వతి దంపతులు పశికంటి శశిప్రీతం స్వాతి దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వర రావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టిన రోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్య క్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 9246939388 నంబరుకు సంప్ర దించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మహమ్మద్ అబ్దుల్ రఫీక్ సగ్గు రాహూల్ పసుల శ్రీధర్ మధు కవిత మఠం శివకుమార్ గంప గోపాల్ రాచకొండ నందయ్య తదితరులు పాల్గొన్నారు
🏠 Home