కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు సగం లోనే నిలిచిపోయాయి.2024 సంవత్సరంలో అట్టహాసంగా భూమి పూజ చేసి పనులు ప్రారంభించినప్పటికీ సంవత్సరం గడుస్తున్న పనులు పూర్తి కాకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కొరతతోనే ఆగిపోయిన పనులు
గ్రామస్తులు మరియు స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ఈ నిర్మాణం నిధుల కొరత కారణంగా నిలిచిపోయినట్టు తెలుస్తుంది. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేసినట్లు సమాచారం భవనం ఇంకా అసంపూర్తిగా ఉండడంతో రాబోయే విద్యా సంవత్సరానికి 2025-2026 ఈ కొత్త భవనం అందుబాటులోకి వస్తుందా లేదా అని అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
మరో ఏడాది అద్దే భవనంలోనేనా
ప్రస్తుతం పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుంది కొత్త భవనం సకాలంలో పూర్తి కాకపోతే వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు అద్దె భవనంలోనే ఇరుకైన గదిలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏఏర్పడుతుందనిపేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే పోచారం పరిశీలన...అయినా వేగం కరువు.
నిజానికి ఈ ప్రాంతంలో నిర్మాణ పనులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 2026 జనవరి ప్రారంభంలో పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు పూర్తికాక పోవడం గమనార్హం.
అధికారులు స్పందించాలి .
విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించి పనులు త్వరగా పూర్తి చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అసంపూర్తి భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.