Banner
Watermark
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
📅 15 April 2026, 03:07 PM ✍️ admin
News Image
ఇల్లంతకుంట మండలం మల్లన్న పల్లి గ్రామంలో మహిళా సంఘం భవనం నిర్మించడానికి గ్రామ సర్పంచి పసునూటి శ్రీనివాస్ మరియు గ్రామ సెక్రెటరీ బండారి మహేందర్ గారి ఆధ్వర్యంలో భూమి పూజ చేసి ముగ్గు పోసి భవన నిర్మాణానికి తోడ్పడ్డారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీను వాస్ మరియు మహేందర్ గార్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని మరి ఇంకా ఎన్నో వసతులు కల్పిస్తామని అధికారుల చొరవతో గ్రామంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి తమ వంతు సాధ్యమైనంత అభివృద్ధి గల గ్రామానికి తోడ్పడుతామని గతంలో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను సరిదిద్దుతామని గ్రామంలో ఎల్లవేళలా ప్రతి సమస్యకు పరిష్కారం చేసి గ్రామంలో ప్రజలందరినీ నా కుటుంబ సభ్యులుగా కాపాడుకుంటానని చెప్పడం జరిగింది
🏠 Home